నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి.. తమ పేరిటే ఉన్న రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసి ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించి ఉండేది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఓ ఫన్నీ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. డేవిడ్ మలన్ కొట్టిన ఒక భారీ సిక్సర్ మైదానికి ఆనుకుని ఉన్న తుప్పల్లో పడింది. అక్కడ బాగా చెట్లు, తీగలు ఉండటంతో ఆ బంతి ఫీల్డర్ కు కనిపించలేదు. ఇంక ఆ బంతిని వెతికేందుకు ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశారు. మొత్తం ఫీల్డర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆఖరికి కెమెరామాన్ కూడా ఆ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాడు. Our third batter to score centuries in all three formats! @dmalan29 joins @Heatherknight55 and @josbuttler in the club Watch Live: https://t.co/Qke57yhBaX#NEDvENG pic.twitter.com/YndgIX9owf — England Cricket (@englandcricket) June 17, 2022 కాసేపు ఆ తుప్పలలో కలియదిరిగిన తర్వాత ఎట్టకేలకు ఆ బంతి వారి కంట పడింది. ఇంకేముంది ప్లేయర్లకు సిరీస్ గెలిచినంత ఆనందం వచ్చేసింది. కేకలు వేస్తూ ఆ బాల్ తీసుకుని మైదానంలోకి పరుగున వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అది ఇంటర్నేషనల్ క్రికెటా? లేక గల్లీ క్రికెటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. All Sixes of Yesterday From England Innings ! Monstrous Hitting pic.twitter.com/F4EgfNu81k — Abhi⚒️ (@abhi_backup07) June 18, 2022 ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టులో ఫిలిప్ సాల్ట్, మలన్, జోస్ బట్లర్ లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నెదర్లాండ్‌కు ఏదైనా మంచి, సంతోషకరమైన సంఘటన అంటే కేవలం అది మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు వరుస పెట్టి సెంచరీలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఫామ్‌ను బాగా కంటిన్యూ చేసినట్లున్నాడు. ఏకంగా 70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లుబాదాడు. అయితే.. ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ఇలా బాల్ కోసం వెతుకులాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Netherlands players are searching for ball after @dmalan29 hits a huge six.#ENGvNED #NEDvENG pic.twitter.com/kp4V50HEnO — (@CliveRossairo) June 17, 2022 ఇదీ చదవండి: దినేష్ కార్తీక్ పై నెటిజన్స్ ప్రశంసలు.. పంత్ ని పక్కన పెట్టాలంటూ..! ఇదీ చదవండి: అరుదైన రికార్డు.. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్!