టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కారణంగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు, వారిద్దరూ విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తనతో కాకుండా శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి వెళ్లడంతో చాహల్ హర్ట్ అయినట్లు అందుకే ధనశ్రీతో విడిపోయేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చాహల్‌ను వదిలేసి అతని భార్య ధనశ్రీ పుట్టింటికి వెళ్తున్నట్లు చాహల్‌తో చెప్పేసింది. దానికి చాహల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. కిండపడి మరీ డాన్స్ చేశాడు. అదేంటి ఆమె పుట్టింటికి వెళ్తుంటే చాహల్ ఎందుకు డాన్స్ చేస్తాడని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆమె నిజంగానే వెళ్లడం లేదు.. అది జస్ట్ ఒక రీల్.
తమ దాంపత్య జీవితంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేందుకు చాహల్-ధనశ్రీ కలిసి చేసి ఒక వీడియోను ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సరదాగా రీల్స్ చేస్తూ, డాన్స్ వీడియోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇప్పుడు వారి విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఒక సరదా పోస్టునే వాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామెంతో సంతోషంగా ఉన్నట్లు ఈ వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారిద్దరూ విడిపోవడం లేదని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ప్రస్తుతం చాహల్ ఆసియా కప్ కోసం యూఏఈలో ఉన్నాడు. మరి చాహల్-ధనశ్రీ రీల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోహ్లీ అంటే పాకిస్థాన్ బౌలర్లకు భయం పోయింది: మాజీ క్రికెటర్