టీమిండియా స్టార్ క్రికెటర్, నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు ఈ నయావాల్. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ బ్యాటర్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమిండియా ఆటగాడు కూడా సాధించలేదు.
టీమిండియా స్టార్ క్రికెటర్, నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒక్కసారి క్రీజ్ లోకి అడుగుపెట్టాడు అంటే.. బౌలర్లకు ఓపిక నశించాల్సిందే. తనదైన జిడ్డు బ్యాటింగ్ తో ఇప్పటికే నయావాల్ గా పేరుగాంచాడు పుజారా. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు ఈ నయావాల్. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ బ్యాటర్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమిండియా ఆటగాడు కూడా సాధించలేదు. మరి ఇంతకి పుజారా సాధించిన ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చతేశ్వర్ పుజారా.. క్రీజ్ లోకి వచ్చాడంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. తనదైన జిడ్డు బ్యాటింగ్ తో బౌలర్లకు సహన పరీక్ష పెడతాడు. క్రీజ్ లో పాతుకుపోయి వందల కొద్ది బాల్స్ ఆడటంలో.. పుజారా దిట్ట ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు పుజారా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలం అయ్యాడు. 6 ఇన్నింగ్స్ ల్లో కేవలం 28 సగటుతో 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే పుజారా ఫామ్ కోల్పోయినప్పుడు కౌంటీ క్రికెట్ టోర్నీలు ఆడటానికి వెళ్తుంటాడు అన్న విషయం అందరికి తెలిసిందే.
ఈ క్రమంలోనే 2022లో అతడు ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ టోర్నీలో పాల్గొన్నాడు. అతడు కౌంటీల్లో ససెక్స్ జట్టు తరపున బరిలోకి దిగి 13 ఇన్నింగ్స్ ల్లో 109.40 సగటుతో 1094 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం. అయితే ససెక్స్ రెగ్యూలర్ కెప్టెన్ అయిన టామ్ హెయిన్స్ కౌంటీ ఛాంపియన్ 2022 టోర్నీలో గాయపడ్డాడు. అప్పటి నుంచి పుజారాను ససెక్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్ కొనసాగిస్తోంది మేనేజ్ మెంట్. ఇక టామ్ హెయిన్స్ గాయం ఇంకా తగ్గకపోవడంతో.. కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2 సీజన్ కు ససెక్స్ జట్టుకు పూర్తి స్థాయి సారథిగా పుజారాను నియమించింది. ఈ విషయాన్ని స్వయంగా పుజారానే ట్వీట్ ద్వార వెల్లడించాడు. కౌంటి ఛాంపియన్ షిప్ లో ససెక్స్ జట్టుకు కెప్టెన్ కావడం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు పుజారా. గురువారం(ఏప్రిల్ 6) నుంచి ఈ ఛాంపియన్ షిప్ ప్రారంభం అవుతోంది. తన తొలి మ్యాచ్ ను గురువారం డర్హమ్ తో ఆడనుంది ససెక్స్ జట్టు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు పుజారా. మరి ససెక్స్ జట్టుకు కెప్టెన్ గా నియమించబడ్డ పుజారా కప్ సాధిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thrilled to lead @sussexccc in the County Championship! Let’s go 💪🏻 pic.twitter.com/iW4Ihstk1p
— Cheteshwar Pujara (@cheteshwar1) April 5, 2023