కపిల్ దేవ్ తర్వాత ఆ రేంజ్ ఆల్ రౌండర్లు టీమిండియాకు దొరకడం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకు ఆ బెడద లేకపోయినా అతనికి గాయమైనా, భవిష్యత్తులో రిటైర్మెంట్ ప్రకటించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలోనే బీసీసీఐ ఒక నాణ్యమైన ఆల్ రౌండర్ ని సిద్ధం చేసే పనిలో ఉంది.
ఏళ్ళు గడిచినా, తరాలు మారినా ఇండియన్ క్రికెట్ టీంలోకి బ్యాటర్లు, బౌలర్లకు కొదవ లేదు. కానీ జట్టులో సమతుల్యం ఉండాలంటే ఆల్ రౌండర్లు ఉండాల్సిందే. ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ఉంటే చాలు 12 మంది ప్లేయర్లు టీంలో ఉన్నట్లుగా ఉంటుంది. అయితే మన టీమిండియాలో స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నా ఎప్పటినుంచో ఒక నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ని తయారు చేసుకోవడంలో వెనకపడిపోతుంది. మన దురదృష్టం కొద్ది ఒక్కో జనరేషన్ కి ఒక్కడే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ దొరుకుతున్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఆ రేంజ్ ఆల్ రౌండర్లు టీమిండియాకు దొరకడం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకు ఆ బెడద లేకపోయినా అతనికి గాయమైనా, భవిష్యత్తులో రిటైర్మెంట్ ప్రకటించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలోనే బీసీసీఐ ఒక నాణ్యమైన ఆల్ రౌండర్ ని సిద్ధం చేసే పనిలో ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓడిపోవడానికి కారణం ఏంటి అడిగితే అందరూ బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకొస్తారు. మరికొందరు బౌలింగ్ వీక్ గా ఉండడం వల్ల ఓడిపోయానమని అనుకుంటారు. కానీ జట్టులో హార్దిక్ పాండ్య లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్ ఉంటే పరిస్థితితి ఎలా ఉండేది? ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పలేకపోయినా ఇలాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉంటే లోయర్ ఆర్డర్ లో అటాకింగ్ చేయడంతో పాటు పేస్ బాధ్యతలను కూడా నిర్వర్తించేవాడు. అయితే ఒక్క హార్దిక్ పాండ్య మీద ఆధారపడితే కష్టమే. అందుకే ఇప్పుడు దేశవాళీలో అదరగొడుతున్న హర్షిత్ రానా మీద సెలక్టర్ల చూపు పడింది. హర్షిత్ రానా ఎవరో కాదు ఈ ఏడాది ఐపీఎల్ లో కోల్ కత్తా జట్టు తరపున అరంగ్రేటం చేసిన పేస్ బౌలర్. ఇతన్ని కేవలం బౌలర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ కుర్రాడి దగ్గర బ్యాటింగ్ చేయగల సత్తా కూడా ఉంది.
ఇటీవలే దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు హర్షిత్. రెండు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టడమే కాదు బ్యాట్‌తోనూ అదరగొట్టాడు . 122*, 31, 38 చొప్పున పరుగులు చేసి నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మని ఇంప్రెస్ చేసాడట. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ల్లో హర్షిత్ ఆటను దగ్గర్నుంచి చూసిన నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ హార్దిక పాండ్య లాంటి ఆల్ రౌండర్ అయ్యాయి అవకాశాలు ఇతనిలో ఉన్నాయని గుర్తించాడు. ఈ క్రమంలోనే దేవధర్ ట్రోఫీకి నార్త్ జోన్ తరపున రాణాను ఎంపిక చేశాడు. లిస్ట్-ఏ ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ ఈ ఆల్ రౌండర్ మీద నమ్మకముంచారు. వేగంగా బౌలింగ్ చేయడం.. లోయర్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు. హర్షిత్ రాణా ఇటీవలే ఎమర్జింగ్స్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఇండియా-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో హార్దిక్ పాండ్య అందించిన సేవలను హర్షిత్ కూడా అందించగలడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే టీమిండియాలోకి సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి తన ఆట తీరుతో సెలక్టర్లను ఎంత వరకు ఇంప్రెస్స్ చేయగలడో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.