సాధారణంగా ఏ క్రికెటర్ పైన అయినా క్రికెట్ బోర్డుకు సంబంధించిన అగ్రిమెంట్లు ఉల్లంఘిస్తే.. లేదా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే.. లేదా ఏదైనా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. సదరు క్రికెటర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆస్ట్రేలియా యువతి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ చర్యపై కొరడా ఝళిపించింది శ్రీలంక బోర్డు. అతడిపై నిషేధం విధించింది. తాజాగా మరో శ్రీలంక క్రికెటర్ పై ఏడాది పాటు నిషేధం విధించింది లంక బోర్డు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
Chamika Karunaratne pic.twitter.com/q7UKHvnXNp
— RVCJ Media (@RVCJ_FB) November 23, 2022
దనుష్క గుణతిలక కేసు మరవక ముందే.. మరో క్రికెటర్ పై చర్యలు తీసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ అయిన చమిక కరుణరత్నేపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ.. నిర్ణయం తీసుకుంది లంక క్రికెట్ బోర్డు. ఇటీలవ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్లను అతడు ఉల్లంఘించినట్లు.. ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో వెల్లడి అయ్యింది. అదీకాక విచారణలో చమిక కరుణరత్నే సైతం అగ్రిమెంట్లు ఉల్లంఘించినట్లు అంగీకరించాడు. దాంతో అతడిపై ఏడాది పాటు ఏ ఫార్మాట్ మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించారు. నిషేధంతో పాటుగా 5వేల డాలర్ల జరిమానా కూడా విధించారు.
🚨 JUST IN 🚨
👉 Chamika Karunaratne has been banned for one year from all forms of the game by Sri Lanka board 🇱🇰
👉 He breached several clauses in the player agreement during the T20 World Cup 2022 😲#RavindraJadeja #ICCrankings pic.twitter.com/VxGzKYYjGO
— SportsBash (@thesportsbash) November 23, 2022