మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినా.., ఆయన అభిమానుల సంఖ్య మాత్రం కాస్తకూడా తగ్గలేదు. క్రికెట్‌కి దూరమైనా అభిమానులకు మాత్రం ఎంఎస్‌డీ ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. ఎంఎస్ ధోనీ ఆయన ఏం చేసినా ప్రత్యేకమే. కరోనా కారణంగా ఐపీఎస్ సీజన్‌కు బ్రేక్ పడినా.. మళ్లీ ఆ సందడి ప్రారంభంకాబోతోంది. ‘అస్లీ పిక్చర్ అభీ బాకీ హే’ అంటూ ఐపీఎల్ అడ్వర్‌టైజ్‌మెంట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ధోనీ లుక్స్ మాములుగా లేవు.
కరోనాకి ముందు జరిగిన ఫస్ట్ హాఫ్‌ని మిస్ అయినా ఇప్పుడు సెకెండ్ హాఫ్ రెట్టించిన ఉత్సాహంతో రాబోతందంటూ ‘దూస్‌రే హాఫ్‌కా పిక్చర్ అభీ బాకీ హే’ కమర్షియల్ సాగుతుంది. పర్పుల్ జాకెట్, గోల్డ్ కలర్ హెయిర్‌తో ఎంఎస్‌డీ ఎంట్రీ అదిరిపోయింది. సస్పెన్స్ ఉంది, హిట్‌మ్యాన్ ఉన్నాడు. హెలికాప్టర్ టేకాఫ్ ఉంది. సూపర్ ఓవర్ క్లైమ్యాక్స్ ఉంది అంటూ ఎంఎస్‌డీ పాడిన ర్యాప్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 సెకెండ్ హాఫ్ ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే.