సాధారణంగా రెండు బలమైన జట్ల మధ్య సిరీస్ జరిగితే మాటల యుద్ధం ఉండడం సహజం. కానీ పసికూన జట్టని తేలికగా తీసుకుంటే తగిన మూల్య చెల్లించుకోవాల్సిందేనని ఐర్లాండ్ ఆటగాడు బెన్ వైట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ ఆడేందుకు టీమిండియా కుర్రాళ్ళు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సీనియర్లు ఆసియా కప్ కి సన్నద్ధమవుతుంటే కుర్రాళ్ళు టీ 20 ల్లో తమ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు యువ టీమిండియా ఐరిష్ గడ్డపై ఇప్పటికే అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించేసింది. శుక్రవారం భారత్-ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టార్ బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి తిరిగి వచ్చిన బూమ్రాకు ఆసియా కప్ ముందు ఈ సిరీస్ ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడుతుంది.
సాధారణంగా రెండు బలమైన జట్ల మధ్య సిరీస్ జరిగితే మాటల యుద్ధం ఉండడం సహజం. కానీ పసికూన జట్టని తేలికగా తీసుకుంటే తగిన మూల్య చెల్లించుకోవాల్సిందేనని ఐర్లాండ్ ఆటగాడు బెన్ వైట్ వార్నింగ్ ఇచ్చాడు. సిరీస్ ప్రారంభానికి ముందు ఒక వార్నింగ్ ఇచ్చాడు. వైట్ మాట్లాడుతూ ” మేము గత కొంతకాలంగా మెరుగైన క్రికెట్ ఆడుతున్నాం. మాదైన రోజు ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలం. భారత్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారితో ఆడటం చాలా పెద్ద విషయం. కానీ, మేము ఈ సవాల్‌ను ఆస్వాదిస్తాం.”అని ఈ సందర్భంగా వైట్ తెలిపాడు. సొంతగడ్డపై ఐర్లాండ్ ని ఓడించడం కూడా అంత తేలికైన విషయం కాదు. గతేడాది టీమిండియా ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ గెలించినా.. విజయం అంత తేలికగా దక్కలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఐర్లాండ్ ఫామ్ చూస్తుంటే ఈ సారి కుర్రాళ్లతో నిండిన భారత్ జట్టుకు షాక్ ఇచ్చిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఇక టీమిండియా విషయానికి వస్తే బూమ్రా మినహాయిస్తే అందరూ కుర్రాలతో నిండిపోవడం విశేషం. జట్టులో సగానికి పైగా పట్టుమని పది మ్యాచులు కూడా ఆడకపోగా కొంతమంది తొలి మ్యాచులో ఛాన్స్ కోసం ఆరాటపడుతున్నారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే ఇలా అంత యంగ్ బ్లడ్‌తో టీమిండియా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రేపు 18న శుక్రవారం తొలి టీ20 ప్రారంభం కానుండగా.. 20 న రెండో టీ 20, 23న మూడో టీ 20 జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగానే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరి ఐర్లాండ్ క్రికెటర్ బెన్ వైట్ చేసిన వ్యాఖ్యలపై మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.