స్టార్ క్రికెటర్లంటే ఎవరు మనుసు పారేసుకోరు. విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్.. వీరిని లైన్ లో పెట్టాలని ప్రయత్నించని అమ్మాయి ఉండదంటే నమ్మండి. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు. అదే మన స్టార్ క్రికెటర్లు అమ్మాయిలు అయితే ఎలా ఉండేవారో కృత్రిమమేధ ఫోటోలను రూపొందించింది. ఆ ఫోటోలలో మన క్రికెటర్లు అప్సరలల్లా వెలిగిపుతున్నారు.
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది క్రమక్రమంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. చాట్ జీపీటీకి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ ప్రభావం చూపుతోంది. రజినీకాంత్ నటించిన రోబో సినిమాలో ‘ఓ మరమనిషీ.. మాలోకి రా..’ అని పాడుకున్నాం కదా. అలా మనం పాడుకున్నవిధంగానే మరమనిషి మనలోకి ప్రవేశిస్తున్నాడు. దీని గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే శారీరకంగా మనిషికి పుట్టకపోయినా మేధస్సుపరంగా దీనిది మనిషి పుట్టుకే. మనషిలాగే అన్ని పనులు చేస్తోంది.. ఆలోచిస్తుంది. ప్రవర్తిస్తోంది.
చాట్ జీపీటీ టెక్ రంగంలో ఊహా శక్తికీ రెక్కలు తొడుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ యూజర్ ఏఐ సాయంతో ప్రపంచంలో అత్యంత కుబేరులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, అనిల్ అంబానీ మొదలగువారు పేదవారైతే ఎలా ఉంటారన్న ఫోటోలు సృష్టించిన సంగతి తెలిసిందే. వారి ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా ఓ యూజర్ ఏఐ సాయంతో.. భారత పురుష క్రికెటర్లు అమ్మాయిలైతే ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లు చూపించాడు. భారత స్టార్ క్రికెటర్లైన విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను మహిళలుగా రూపొందించిన కుత్రిమమేధ చిత్రాలను ఓ యూజర్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలలో భారత క్రికెటర్లు అప్సరలల్లా వెలిగిపుతున్నారంటే నమ్మండి.
ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే.. మేల్ క్రికెటర్లందరికీ ఫీమేల్ పేర్లు పెట్టారు. విరాట్ కోహ్లీకి ‘విద్యా కోహ్లీ’ అని, శుభ్‌మాన్ గిల్-సుభద్ర గిల్, మహేంద్ర సింగ్ ధోనీ – మహీ సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా – హర్షలి పాండ్యా, గౌతమ్ గంభీర్ – గౌతమి గంభీర్, యువరాజ్ సింగ్ – యువరాణి సింగ్, రోహిత్ శర్మ – రోహిణి శర్మ, రవీంద్ర జడేజా – రవీణా జడేజా, శిఖర్ ధావన్ – శిఖా ధావన్, రిషబ్ పంత్ – రాశి పంత్.. ఇలా వారికి ఫీమేల్ పేర్లు పెట్టారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.