టి 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత రాత్రి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచిన పాక్.. మూడు వరుస విజయాలతో సెమీస్‌కు మరింత చేరువైంది. మొదటి నుంచి కాస్త దూకుడుగా ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 148 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లకు తలొగ్గిన ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఈ సమయంలో కెప్టెన్ నబీ, గుల్బదిన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ బ్యాట్ ఝళిపించడంతో స్కోరు 100 పరుగులు దాటింది. మొత్తానికి చివరి ఓవర్లలో పాక్ బౌలర్లపై నబీ, గుల్బదిన్ ఎదురుదాడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించి కాస్త పరువు నిలుపుకున్నారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వాసి 2, షహీన్ అఫ్రిది 1, హరీస్ రవూఫ్ 1, హసన్ అలీ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్థాన్ తొలుత అద్భుతంగా కట్టడి చేసింది.
ఒక దశలో పాకిస్థాన్ కష్టాల్లో పడిపోతుందని అందరూ భావించారు. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 24 పరుగులు అవసరం కాగా అసిఫ్ అలీ చెలరేగిపోయాడు. మొత్తంగా 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అసిఫ్ అలీ 4 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లలో 25కు పైగా పరుగులు చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అసిఫ్ అలీ మూడో స్థానంలో నిలిచాడు.
Asif Ali you beauty #PakvsAfg pic.twitter.com/ohq4bzGIMu
— Murtaza Ali Shah (@MurtazaViews) October 29, 2021