ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టన చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా పాలన చేశారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమల రెడ్డి ఆరోపించారు. ఇష్టమొచ్చినట్లు డబ్బులు ఖర్చు చేసి, ఎలాగో మరోసారి గెలవను అని తెలిసి రాష్ట్రాన్ని నాశనం చేసి వైఎస్ జగన్ చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. చిందరవందర చేసి రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెట్టి.. తన తప్పుకు జగన్ బాధ్యత వహించేలా చంద్రబాబు చేశారని విమల దుయ్యబట్టారు. ఆదివారం సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ విమల పలు విషయాలపై సూటిగా స్పందించారు. చంద్రబాబు కేవలం జగన్‌ను టార్గెట్ చేసుకుని ఏపీని సర్వనాశనం చేశారని అన్నారు. కుటుంబసభ్యులను కూడా మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబసభ్యులతో ఎలా ఉంటుంన్నారనే విషయంపై స్పందిస్తూ.. జగన్ కుటుంబసభ్యులతో ఎంతో ఆప్యాయంగా ఉంటాడని అన్నారు. కుటుంబసభ్యులను కలిసేందుకు ఇష్టపడడు, అపాయింట్‌మెంట్ ఇవ్వడు అనేవి ఒట్టి పుకార్లే అని.. ఏ అవసరం వచ్చిన జగన్ ముందుంటాని తెలిపారు. కాకపోతే చెద్ద వ్యక్తులకు మాత్రం దూరంగా ఉంటాడని, వారిని దగ్గరికి రానివ్వడని వెల్లడించారు. అలాగే జగన్‌కు ఆమె సతీమణి వైఎస్ భారతి ఎంతో సపోర్టుగా ఉంటుందని విమల తెలిపారు. కాకపోతే వాళ్లు ఇద్దరు చాలా లోన్లీగా ఫీల్ అవుతారని అన్నారు.
తమ తాత వైఎస్ రాంరెడ్డి కుటుంబసభ్యులందరం ఒక్కటే అన్ని అన్నారు. తన అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎంతో ఆప్యాయంగా చూసుకునే వాడని తెలిపారు. తాను చిన్న వయసలోనే భర్తను పొగొట్టుకుని వితంతవు అయినట్లు.. అందుకే అన్న వైఎస్సార్‌కు ఏ భర్త లేని స్త్రీని చూపినా తానే గుర్తు వచ్చేదాన్ని అని పేర్కొన్నారు. అందుకే వైఎస్సార్ సీఎం అయిన తర్వాత వితంతు పెన్షన్లు పెంచినట్లు గుర్తు చేసుకున్నారు. మరి వైఎస్ విమలరెడ్డి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వైఎస్ వివేకా హత్యలో అవినాశ్ పాత్రపై స్పందించిన వైఎస్ చెల్లెలు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.