ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనవసరంగా మీరు పార్టీ సీఎల్పీలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇక రావటమే కాకుండా పార్టీపై అనవసరమైన వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ హాల్ లో కి వచ్చిన జేసీ తన పాత్ర మిత్రులను కలిసి కాసేపు ముచ్చటించారు. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడిన జేసీ పార్టీ గురుంచి వివరాలు తెలుసుకున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జేసీ తీరుపై కాస్త ఘాటుగా స్పందించి ఫైర్ అయ్యారు. ఇలా సీఎల్పీ మీటింగ్ రావొద్దని చేతులు జోడించి దండం పెట్టారు. ఇక పార్టీకి డ్యామేజ్ అయ్యే పనులు చేయొద్దని, పార్టీకి మంచి విషయాలు చెప్పకపోయిన పర్లేదు కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దంటూ జీవన్ రెడ్డి సూచించారు. ఇక మేల్కొన్న జేసీ సరే తప్పు జరిగింది.
ఇక మాట్లాడనంటూ సమాధానమిచ్చారు. ఇక నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కావటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి సీనియర్ నేతలతో పాటు అన్ని పార్టీల నేతలతో కలిసి మీడియాతో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోతారని ముందే చెప్పానంటూ జేసీ కామెంట్స్ చేయటం కాస్త చర్చనీయాంశమవుతోంది.