ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ.. కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవానికి స్పీకర్ తమ్మినేని వెళ్లారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్ గా మారాడు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవారు వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
కబడ్డీని సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్ కాలేజి వేదికగా నియోజకవర్గ స్థాయి క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ పాల్గొన్న సందర్భంలో కబడ్డీ ఆడుతూ ఆయన కిందపడిపోయారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆయన్ని వెంటనే లేపారు. ఎటువంటి గాయాలు కాక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.