మనల్ని, మనదేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద నిరంతరం సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. చేత గన్ పట్టి, శత్రువుల రాకను పసిగడుతూ..ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంటారు. నిత్యం తమ విధులో ఉండే జవాన్లు ..కొంచెం సేపు సరదగా కోసం ఆటలు ఆడుతూ సేద తీరుతారు. తాజాగా హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలోని పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది. విధులు నిర్వహిస్తూ కాసేపు కబడ్డీ..కబడ్డీ అంటూ జవాన్లు పోటీ పడ్డారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు రేఖ వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఖాళీ సమయాల్లో కబడ్డీ ఆడారు. దట్టమైన మంచు కురిస్తుండగా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతలు వేస్తూ సైనికులు ఉల్లాసంగా గడిపారు. పర్వత ప్రాంతాలలో మన దేశాన్ని రక్షించే సైనికుల కబడ్డీ కబడ్డీ అంటూ పోటీపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలలో ITBP సిబ్బంది బరువైన ఉన్ని దుస్తులు ధరించి కబడ్డీ ఆట ఆడారు. సరిహద్దు రేఖ వద్ద కొంచెం సేపు వారు సంతోషంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Full of josh,
Playing in snow…#Himveers of Indo-Tibetan Border Police (ITBP) playing Kabaddi in high Himalayas in Himachal Pradesh.#FitnessMotivation #FitIndia@KirenRijiju @ianuragthakur @FitIndiaOff pic.twitter.com/VjEEsuA2HL— ITBP (@ITBP_official) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.