కబడ్డీ ఆట అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టముంటుంది. ఆ ఆటలో ఉండే మజా వేరనే చెప్పాలి. ఇకపోతే మనం అమ్మాయిలు, అబ్బాయిలు కబడ్డీ ఆడడం చూసే ఉంటాం. కానీ పల్లెటూరులో ఇంటి సందుల మధ్య చీరకట్టుతో కూత పెట్టి కబడ్డీ ఆడే మహిళలను ఎప్పుడైనా చూశారా? ఇలా చీరకట్టులో కబడ్డీ ఆడుతున్న కొందరి మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది. చీరకట్టులోనూ దమ్ములేపుతూ కబడ్డీ ఆడుతున్న ఈ మహిళలు ఎవరు? ఎక్కడైనా పోటీలో పాల్గొన్నారా అనే పూర్తి వివరాలు తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
విషయం ఏంటంటే? చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘెల్ ఆధునిక పోటీ ప్రపంచంలో వెనకబడుతున్న సాంప్రదాయ క్రీడలను పోత్సహించేందుకు పథకం రచించారు. ఇక కనుమరుగవుతున్నసాంప్రదాయ క్రీడలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో భాగంగానే చత్తీస్‌గఢ్ ఒలంపిక్స్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు అక్టోబర్ 6 నుంచి జనవరి 6 వరకు జరుగుతాయి.
అయితే చత్తీస్‌గఢ్ ఒలంపిక్స్ క్రీడల్లో భాగంగా కబడ్డీ, గిల్లిదండా, పిట్టూల్, లాంగ్డి రన్, బంతి, బిల్లాస్, ఫుగ్డితో పాటు గెడి రేస్ వంటి మరెన్నో క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో మహిళల నుంచి పరుషుల వరకు వేర్వేరు విభాగాల్లో క్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే కబడ్డీ పోటీల్లో భాగంగా కొందరు మహిళలు చీరకట్టులో ఆడుతున్న ఈ కబడ్డీ వీడియోను ఓ అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్స్ భిన్నరీతిలో స్పందిస్తూ షర్ చేస్తున్నారు. ఇదే వీడియో ఈ వీడియో ప్రస్తుతం కాస్త వైరల్ గా మారుతోంది.