ఈ వీకెండ్ మీరు సినిమాల జాతర చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి, రెండు కాదు ఏకంగా 32 కొత్త మూవీస్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి వాటి సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయి?
వీకెండ్ వస్తే చాలు సినిమాల జాతర మొదలైపోతుంది. థియేటర్లకు వెళ్లేవారి సంగతేమో గానీ ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ కోసం కొందరు ఆడియెన్స్ తెగ వెయిట్ చేస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతి వీక్ కూడా 20కి తగ్గకుండా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతూ ఉంటాయి. గతంలో సంగతేమో గానీ ఈసారి ఏకంగా 32 కొత్త చిత్రాలు/ సిరీసులు ఫుల్ గా ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయాయి. వీటిలో డైరెక్ట్ తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి చివరికి వచ్చేశాం. పిల్లల ఎగ్జామ్స్ కూడా దాదాపు పూర్తయిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల హడావుడి మొదలైపోయింది. ఈ వీకెండ్ అంటే శుక్రవారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఈ లిస్టులో గోదారి అనే తెలుగు డాక్యుమెంటరీతోపాటు ‘సత్తిగాని రెండెకరాలు’ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ‘అమిగోస్’, ‘షెహజాదా’ లాంటి చిత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి.