ఓటీటీలో కొత్త సినిమాల కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఓటీటీ ప్రేక్షకులు గెట్ రెడీ.. మీ కోసం ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ మూవీస్ తోపాటు ఇంగ్లీష్, హిందీ సిరీస్ లు చాలానే ఉన్నాయి. వాటిలో ఓ మూవీ మాత్రం తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అలా అని మిగతా సినిమాలు చూడకూడదని కాదు. అదే టైంలో థియేటర్లలోనూ విడుదల కాబోతున్న ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. సరే వీటి గురించి వదిలేయండి కానీ.. ఓటీటీలో ఈ వారం రిలీజ్ కాబోయే కొత్త సినిమాల సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత రెండు మూడేళ్ల నుంచి ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో వచ్చే మూవీస్ తోపాటు ప్రతి వారం ఓటీటీల్లోనూ 20కి పైగా చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం స్ట్రెయిట్ తెలుగు సినిమాలేం రిలీజ్ కావట్లేదు కానీ పలు డబ్బింగ్ వి మాత్రం రెడీగా ఉన్నాయి. వాటిలో మలయాళ డబ్బింగ్ ‘రోమాంచమ్’ కాస్త ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండేసరికి నెటిజన్స్ దీన్ని ఎలాగైనా సరే చూడాలని తెగ ఆత్రుతగా ఉన్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/ సిరీసుల ఇవే.