ఓటీటీలోకి శ్రీలీల 'కిస్' సినిమా వచ్చేసింది. అదేంటి.. ఆ పేరుతో శ్రీలీల సినిమాలేం చేయట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ స్టోరీ చదివితే అసలు విషయం అర్థమైపోతుంది.
శ్రీలీల.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్. ఎందుకంటే అందంగా ఉన్న బ్యూటీస్ సరిగా యాక్టింగ్ చేయకపోవచ్చు. ఛామనఛాయగా ఉన్న హీరోయిన్లు డ్యాన్స్ లో అదరగొట్టేయొచ్చు. శ్రీలీల మాత్రం అన్నింట్లోనూ ఫెర్ఫెక్ట్ అనిపించుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు రెండు సినిమాలే చేసినప్పటికీ.. క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజులో సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె నటించిన ఫస్ట్ ఫస్ట్ మూవీ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజైపోయింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీల కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. ఇతర భాషల్లో హిట్ అయిన చాలా మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ లిస్టులో ‘ఆహా’ ముందు వరసలో ఉంది. కన్నడ, మళయాళ, తమిళంలో హిట్, బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని ఓటీటీలోకి తెలుగులో తీసుకొస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఇప్పుడు అలానే శ్రీలీల ఫస్ట్ మూవీ ‘కిస్’ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అమెరికాలో పుట్టిన శ్రీలీల.. బెంగళూరులో పెరిగింది. అలా కన్నడలో ఫస్ట్ ‘కిస్’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. 2019లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ డోస్ కాస్త గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు కొట్టేసి బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం శ్రీలీల చేసిన ఫస్ట్ మూవీని ఇప్పుడు ‘ఐ లవ్ యూ ఇడియట్’ పేరుతో ఆహాలో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి మీలో శ్రీలీల ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? శ్రీలీలలో మీకు ఏమంటే ఇష్టమనేది కింద కామెంట్ చేయండి.