హెల్త్ డెస్క్- కరోనా వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా దాడి చేస్తోంది. దోంతో కరోనా అంటేనే అంతా భయంతో వణికిపోతున్నారు. కరోనా భారత దేశంలో జనజీవనాన్ని అస్థవ్యస్తం చేసింది. చాల మంది ఈ మహమ్మారికి బలవ్వడంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. కరోనాకు తోడు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ వచ్చిపడింది. కరోనా సోకి తగ్గిన రోగులపై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. అది కూడా మన భారత దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పుడు కరోనా, బ్లాక్ ఫంగస్ కు తోడు మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఇవి రెండు చాలవన్నట్లు తాగాజా వైట్ ఫంగస్ వైరస్ దాడి మొదలుపెట్టింది. ఇప్పడిప్పుడే మన దేశంలో వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. బీహార్ లో ఇప్పటికే నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.
పాట్నా మెడికల్ కళాశాలలో నలుగురు వైట్ ఫంగస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఐతే కరోనా లక్షణాలను గుర్తించినంత సులువుగా వైట్ ఫంగస్ లక్షణాలను గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వైట్ ఫంగస్ లక్షణాలు చాలా కొద్దిగాన ఉంటాయట. ప్రధానంగా కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు, వాసన, రుచి కోల్పోవడం వంటివి కనిపించిన వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కొవిడ్ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంటే దీనిని వైట్ ఫంగస్ గా అనుమానించాల్సి ఉంంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, హెచ్ఆర్సీటీ టెస్ట్ చేయడం ద్వారా వైట్ ఫంగస్ ను గుర్తించవచ్చని నిపుణులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వీరు హెచ్చరిస్తున్నారు. కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, మర్మాంగాలు, నోరు భాగాలపై కూడా బ్లాక్ ఫంగస్ ప్రభావం చూపుతుందట.
కరోనా వైరస్ బారినపడిప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ సోకిన మాదిరిగానే రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి వైట్ ఫంగస్ సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్లకు వైట్ ఫంగస్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్ ఫంగస్ రోగుల ఊపిరితిత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా క్యాన్సర్ రోగులు వైట్ ఫంగస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులంటున్నారు. వైట్ ఫంగస్ పిల్లలు, మహిళలకు కూడా సోకుతుందని పాట్నా వైద్య కళాశాల డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతానికి యాంటీ ఫంగల్ ఔషధాలను వినియోగించి వైట్ ఫంగస్ రోగులతు చికిత్స అందిస్తున్నారు.