ఫిల్మ్ డెస్క్- సురేష్ బాబు.. ఈ పేరు ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలియనివారుండరు. ఇత తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం సురేష్ బాబు సుపరిచితం. సురేష్ ప్రడక్షన్స్ పేరుతో మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు చాలా బాషల్లో సినిమాలు నిర్మించారు. ఆయన తరువాత రామానాయుడి వారసుడిగా సినిమా నిర్మాణ రంగంలో కొనసాగుతూ వస్తున్నారు సురేష్ బాబు.
తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంతో సురేష్ బాబుపై అందరు ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. అటు మీడియా సైతం సురేష్ బాబు ను ఇంటర్వూ చేస్తున్న సమయంలో ఆయన చాలా విషయాలను చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయిలతో ఎఫైర్స్, మద్యం సేవించడం వంటి విషయాలపై ఆసక్తికరమైన అనుభవాలను చెప్పారు సురేష్ బాబు.
చిన్నప్పటి నుంచే జీవితం పట్ల స్పష్టమైన ఆలోచనలో ఉన్నానని, అందుకే నటన వైపు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నా అది కాదని, నిర్మాతగా మారానని సురేష్ బాబు చెప్పారు. తాను సాధించాలనుకున్నది ఇప్పుడు సాధిచానని సురేష్ బాబు అన్నారు. తన బాబాయ్ అంటే పిన్ని భర్తను చూసి మందు తాగడం అనేది జీవితంలో అలవాటు చేసుకోకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నానని చెప్పారు. పిన్ని భర్త మద్యానికి బానిస కావడం వల్ల ఆమె జీవితం నాశనం అయిపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశం ఉన్నా ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదని సురేష్ బాబు చెప్పారు. జీవితంలో ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తనకు వచ్చే భార్యకు అన్యాయం చేయొద్దనే ఉద్దశ్యంతోనే ఒక్కరితో కూడా ఎఫైర్ పెట్టుకోలేదన్నారు. తనకు వచ్చే భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటే దానిని భరించగల శక్తి నాకు లేదు, అందుకే ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఒక్కరితో కూడా ఎపైర్ జోలికి వెళ్లలేదని సురేష్ బాబు ఆసక్తికరమైన అంశాలను చెప్పారు.