ఫిల్మ్ డెస్క్- హీరో సుమంత్ సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నారు.. కాదు కాదు సుమంత్ త్వరలోనే రెండు పెళ్లి చేసుకోబోతున్నారు.. అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలివి. ఆఖరికి పెళ్లి కూతురు పేరు పవిత్ర అని, వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది సుమంత్ పెళ్లిపై ఇటు అభిమానుల్లో, అటు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తినెలకొంది.
తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని సుమంత్ 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరికీ విభేదాలు రావడంతో రెండేళ్ల తరువాత 2016లో విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లకు పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. సందిట్లో సడేమియాలా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సుమంత్ పెళ్లిపై సెటైర్ వేశారు.
ఒక పెళ్లి నూరేళ్ల పెంట అయితే రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి.. నా మాట విని మానెయ్యి, పవిత్ర గారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, తప్పు నీది, సుమంత్‌ది కాదు.. మన దౌర్భాగ్యపు వ్యవస్థది.. ఆర్జీవీ తనస్టైల్లో ట్వీట్ చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. ఒకసారి పెళ్లయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్, నీ కర్మ, ఆ పవిత్ర కర్మ, అనుభవించండి.. అంటూ దండం పెడుతూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. దీంతో సుమంత్ పెళ్లి మ్యాటర్ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో తన పెళ్లి అంశంపై హీరో సుమంత్ ఓ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. తన పెళ్లి గురించి ఇంతగా ఆలోచిస్తున్న వారికి, అలాగే తన పెళ్లి పట్ల ఇంత ప్రాధాన్యత తీసుకున్న రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లకు చెప్పేదొకటే, నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు.. అని చెప్పుకొచ్చారు సుమంత్. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ పెళ్లి పత్రిక తన సినిమాకు సంబంధించిందని అసలు విషయం చెప్పారు. ఆ సినిమాకు సంబందించి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు సుమంత్.
🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021