ఫిల్మ్ డెస్క్- మంగ్లీ.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు తెలులు ప్రేక్షకులకు సుపరిచితమే. జానపద గీతాల నుంచి మొదలు భక్తి గీతాలు, సినిమాల్లోని పాటల వరకు మంగ్లీ పాడితే దానికి వచ్చే క్రేజే వేరు. మంగ్లి చేసే కవర్ సాంగ్స్ సైతం అందరినీ మెప్పిస్తుంటాయి. చాలా రోజులు కష్టపడితే మంగ్లీకి ఈ స్టార్డం వచ్చింది.
ఐతే మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్‌కి మాత్రం ఓవర్ నైట్ లో స్టార్డం వచ్చింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా ఊ ఊ అంటావా అనే పాటతో ఇంద్రావతి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఈ పాటను మంగ్లీ కన్నడలో పాడింది. కానీ తెలుగులో ఇంద్రావతి పాడితే వచ్చిన క్రేజ్, ఎఫెక్ట్ మాత్రం అక్కడ రాలేదనే చెప్పాలి.
ఇక ఇంద్రావతి వాయిస్ కంటే, ఆమె పాట పాడే వీడియోలో ఇంద్రావతి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఇంద్రావతి పాడిన తీరు, లిరికల్ వీడియోలో ఇంద్రావతి తన కళ్లతోనే మత్తెక్కించింది. ఇప్పుడు మంగ్లీ, ఇంద్రావతి ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక మున్ముందు ఇంద్రావతికి సింగర్‌గా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
ఇదిగో ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి రీల్ వీడియో చేశారు. ఇన్ స్టాగ్రాంలో ఇప్పుడు రీల్ వీడియోల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. పౌర్ణమి పాటకు సంబంధించిన మ్యూజిక్కు మంగ్లీ, ఇంద్రావతి స్టెప్పులు వేయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.