కరోనా ప్రపంచాన్ని కుదిపేసి జన జీవితాన్ని నాశనం చేసింది ,కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చించి .దారుణానికి పరాకాష్టగా తయారై లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి .సైన్సిస్ట్ లు రెండు సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా వాక్సిన్ కనుగొన్నారు .ప్రయోగాత్మకంగా పనిచేస్తుందన్న పరిశోధనల ద్వారా ప్రపంచమంతటా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ని పంపిణీ చేసారు.ప్రభుత్వం వాటిని సవ్యంగా అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఆ రెండింటిలో ఏది మంచిది ,ఏది వాడటం వలన కరోనా బారి నుండి కాపాడుకోగలం అన్న సందేహం ప్రజలకి కలిగింది .తరువాత వాటిల్లో ఏది వాడినా సమానమైన ఫలితం ఉంటుందని నిర్ధారించిన తరువాత ప్రజలకి మంచి అవగాహన ఏర్పడింది. తరువాత జరిపిన పరిశోధనల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండింటిని కలిపితే ఎలాంటి ఫలితం ఉంటుందో పరిశోధిస్తే అద్భుతమైన విషయాలు వెలుగు చూసాయి ఆ పరిశోధనా విషయాల్ని తెలుసుకుందాం !
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే కలిగే ఫలితాలపై తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పరిశోధనలు జరుగనున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా జనవరి 16నుంచి ఇప్పటివరకూ దేశమంతటా 45కోట్ల మందికి టీకాలు వేశారు. ఆ సమయంలో పొరపాటున కొందరికి ఒక్కో డోస్‌లో ఒక్కోరకం వ్యాక్సిన్ వేశారు. రెండు రకాల టీకాలు వేసుకున్నా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వారు ఆరోగ్యంగా ఉన్నారు.
థాయ్‌లాండ్ సహా కొన్ని దేశాల్లో ఈ రెండు టీకాలు కలిపి వేస్తున్నారు. దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో మన దేశంలోనూ రెండు టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై పరిశోధనలు జరిపేందుకు కేంద్ర మందుల నాణ్యతా నియంత్రణ మండలి వైద్యనిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో 300మందిపై ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిన్‌లను ఒకే డోస్‌గా వేసి పరిశీలించనున్నారు. ఈ పరిశోధనల్లో వెల్లడయ్యే ఫలితాలను బట్టి భవిష్యత్తులో వ్యాక్సిన్ల ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.ఏది ఏమైనా మంచి ఫలితాలు కలిగించి కరోనా మహమ్మారి అంతం అవ్వాలని మనసారా కోరుకుందాం.మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి .