ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి ప్రగతి అంటె తెలియనివారుండరేమో. ఎందుకంటే సినిమాల్లో వదిన, అక్క, తల్లి, అత్త పాత్రలు వేసే ప్రగతి, సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ప్రగతి చేసే వర్కవుట్లు, డ్యాన్స్ కు అంతా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డెట్స్ హాట్ ఫోటోలతో కుర్రకారును ఆకర్షిస్తోంది ప్రగతి.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే ప్రగతి, తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. తాను ఇంట్లో, జిమ్ లో చేస్తున్న వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది కదా. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది ప్రగతి. హీరోయిన్లు సైతం ఔరా అనుకునేలా మంచి ఎనర్జీతో ఎక్సర్సైజ్ చేసింది ప్రగతి.
ఇంకేముంది ఇప్పుడు ప్రగతి వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొన్నిసార్లు మీరు వంతెన తెంచేసి మరీ ఈత నేర్చుకోవాలి. వర్కవుట్స్ అనేవి మనలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి అని ట్యాగ్ చేసింది ప్రగతి. ఇక ప్రగతి వర్కవుట్స్ చూసి నెటిజన్స్ ఊరికే ఉంటారా.. ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు కదా.
ఈ వయసులో కూడా వాట్ ఏ ఎనర్జీ అంటూ కొంత మంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ ఓ నెటిజన్ మాత్రం మీరు ఇంత కష్టపడుతున్నా సన్నబడటం లేదేంటి మేడం.. అని ప్రశ్నించాడు. దీనికి రియాక్ట్ అయిన ప్రగతి.. వర్కవుట్స్ అనేవి సన్నబడటం కోసం కాదు.. శారీరకంగా, మానసికంగా దృఢంగా అవ్వడానికి అంటూ సమధానం చెప్పింది.