సదా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. ‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాందించిది ఈ అమ్మడు. ఆ తర్వాత అడపాదడపా విజయాలు సాధించి.. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పక్కనహీరోయిన్ గా చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలో నటించి.. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల కొంతకాలం క్రితం సదా టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఓ రియాల్టీ షో కి జడ్జిగా కూడా వ్యవహరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూల పాల్గొన్న సదా .. సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు.
సాధారణంగా హీరోయిన్లు స్టార్ డమ్ నుంచి పడిపోయినప్పుడు వారి స్క్రిప్ట్ ఎంపిక లోపం వలనో లేక అవకాశాలో రాకనో కొన్ని బోల్డ్ సినిమాలు చేస్తుంటారు. అలాంటి సినిమాల వలన వీళ్లకి ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సార్లు తీవ్ర అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సదా మాట్లాడుతూ.. ‘టార్చలైట్(శ్రీమతి 21F)’ సినిమాలో వేశ్యపాత్రలో నటించినప్పుడు చాలా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని చెబుతూ ఎమోషనలైంది. ఈక్రమంలో తాను ఎందుకు అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది కారణాలు తెలిపింది. ప్రస్తుతం సదా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. సదా కెరీర్ పై, ఆమె సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.