నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే..
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో బాధపడుతూ జీవితాన్ని దుర్భరంగా గడపుతున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట సమీపం నుంచి ఆర్టీస్ బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపుకు వెళ్తుంది. అలా నిత్యం ప్రతి రోజు వెళ్తుంది.ఎప్పటి లాగానే ఈ రోజు కూడా ఆ మార్గం వైపు వెళ్తుండగా అనుకోకుండా డ్రైవర్ నడిపే స్టీరింగ్ విరిగిపోయింది. దాంతో అతను బస్సు ను కంట్రోల్ చేయలేక పోయాడు. విరిగిపోయాక కూడా అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చి కోమర్తి జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా బస్సు అదుపు తప్పింది. ఆ క్రమంలోనే డ్రైవర్, కండక్టర్ తో సహా.. 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి… ఈ ప్రమాద కారణంగా హైవేపై పలు వాహానాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం చోటు చేసుకుంది.