ఆ పథకం ఎలా అంటే చిన్నతల్లి గత కొంత కాలం నుంచి రేగ గ్రామానికి చెందిన డెంకాడ వాసును ప్రేమిస్తుంది. ప్రియుడికి జరిగిందంతా చెప్పి.. మహేశ్వరిని చంపే పథకాన్ని అతడికి వివరించింది.
ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. అలాంటి స్నేహానికే కొంతమంది ద్రోహం చేస్తున్నారు. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా ఎల్. కోట మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకెడ మహేశ్వరి, గాడి చిన్నతల్లిలు మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ ఓకే గ్రామంలో.. వైఎస్సార్ క్రాంతి పథంలో బుక్ కీపర్లుగా పని చేస్తున్నారు. వాళిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. అలా వాళ్ల స్నేహం కొన్ని రోజుల దాకా బాగానే నడిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. ఈ క్రమంలోనే మహేశ్వరీ, గాడి చిన్నతల్లి ఇద్దరు కలిసి సీత్రనిధి రుణాల్లోని కొంత డబ్బును అప్పుగా తీసుకొని తన అవసరాలకు వాడుకుంది. అప్పుగా మహేశ్వరి తీసుకున్న డబ్బును అప్పుడప్పడు బ్యాంకులో జమ చేస్తూ వచ్చేది. ఇంకా మహిళా మండలి సభ్యుల నిధులను వీరిద్దరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు. ఇలా కొన్నాళ్లు గడిచాక, ‘‘ మనం ఈ డబ్బును ఎన్నాళ్లని వాడుకుంటాం. నేను వాడుకున్న డబ్బులు ఇస్తాను. నీవు అప్పుగా తీసుకున్న డబ్బులను తీసుకు రా.. మెుత్తం అంతా లెక్క చేసి బ్యాంకులో వేసి హాయిగా ఉందాం’ అని మహేశ్వరి చిన్నతల్లికి చెప్పింది. దీంతో చిన్నతల్లికి కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహేశ్వరిని చంపటానికి పథకం రచించింది.
ఆ పథకం ఎలా అంటే చిన్నతల్లి గత కొంత కాలం నుంచి రేగ గ్రామానికి చెందిన డెంకాడ వాసును ప్రేమిస్తుంది. ప్రియుడికి జరిగిందంతా చెప్పి.. మహేశ్వరిని చంపే పథకాన్ని అతడికి వివరించింది. అతడు అన్నింటికి ఒప్పుకున్నాక ఈ నెల 17 వ తేదీన మహేశ్వరిని కారులో ఎక్కించుకొని విజయనగరం మహిళా ప్రాంగణంలో సమావేశానికి బయలుదేరారు. అనంతరం అలమండసంత సమీపంలో టిఫిన్ చేశారు. అక్కడ నుంచి మళ్లీ భీమసింగి బ్రిడ్జి కిందకు కారును తీసుకెళ్లి ఆపారు. ఆ తర్వాత కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరిని తో మాట్లాడుతూ.. ఆమె చున్నీతో గట్టిగా పీకకు ముడేసి చంపేసారు. అనంతరం చిన్నతల్లి ఆమెకు ఏమి తెలియనట్టుగా విజయనగరం సమావేశానికి వెళ్లింది. వాసు.. మహేశ్వరి శవాన్ని దూరం పడేశాడు. ఈ నెల 18 మృతదేహం వెలుగులోకి వచ్చింది.
ఆ క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. అయినా ఏమీ తెలియ రాలేదు. చిన్నతల్లి తన మీద అనుమానం రాకుండా ఫోన్ లొకెషన్స్, ఎలాంటి సమాచారం బయటపడకుండా జాగ్రత్త పడి ఆమె ప్రియుడు, మరో ప్రియుడు కోరాడ సాయికుమార్ తో కలిసి దూరంగా వెళ్లిపోవాలని బుధవారం సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు చిన్నతల్లి మీద అనుమానం వచ్చింది. ఆమెను లక్కవరపుకోట మండలం గంగుబూడి కూడలి వద్ద అదుపులోకి తీసుకొని, తమదైన పద్దతిలో అడగగా నేరాన్ని ఒప్పుకుంది. తర్వాత మిగిలిన ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జిముందు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.