ఒకప్పుడైతే సినిమా చాన్సులు తగ్గితే నటీనటులకి సీరియల్స్ ఆప్షన్ గా ఉండేవి. కానీ.., ఇప్పుడు ట్రెండ్ మారింది. కొద్దిగా ఫేడ్ అవుట్ అయితే చాలు యాక్టర్లంతా ఓటీటీల్లో దూరేస్తున్నారు. క్రేజ్ ఉన్నప్పుడే అక్కడా కొంత వెనకేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
టాలీవుడ్ లో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హవాకు బ్రేక్ పడినట్టే అనిపిస్తోంది. గతంలో ఈ బ్యూటీ చేతిలో ఎప్పుడు చూసినా అరడజను సినిమాలు ఉండేవి. కానీ.., ఇప్పుడు ఈ పొడుగుకాళ్ళ సుందరి చేతిలో ఒకటి రెండు సినిమాలు తప్పితే వేరే కొత్త సినిమాలు ఏవీ కనబడటంలేదు. అవి కూడా పూర్తయిన సినిమాలే. కొత్తగా చేసే సినిమాల సంఖ్య మాత్రం చాలా తగ్గిపోయింది. అటు బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే.., రీసెంట్ గా అమ్మడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. అయితే.., ఈ ఒక్క ఛాన్స్ రకుల్ కెరీర్ ని మలుపు తిప్పకపోవచ్చు. దీంతో కొత్త ఆలోచనలు చేస్తుందట రకుల్.
టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమా అవకాశాలు రాని హీరోయిన్లందరూ వెబ్ సిరీస్ చేస్తున్న క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లలో నటించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్ చేసి సక్సెస్ ను అందుకున్నారు. వారిలాగానే తాను కూడా చేయాలని రకుల్ భావిస్తోందట. ఇప్పటికే ఓ వెబ్‌సీరిస్‌కు ఒకే చెప్పేసిందట. పేరున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లతో కూడిన ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది
తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్.. ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఓ భారీ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది .అక్టోబర్ 31 నుంచి లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం స్ట్రీమ్ కాబోతోంది . ఒక హాలోవీన్ నైట్ లో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఓటీటీలో అమ్మడి అదృష్టం ఎలా ఉండబోతుందో?