పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలకు విలువ ఇచ్చి.., ఇద్దరు కొత్త వ్యక్తులు ఒకటిగా జీవితాన్ని గడపడం మామూలు విషయం కాదు. ఇందుకే భార్యభర్తల బంధం చాలా గొప్పది అంటారు. కానీ.., కొంతమంది ఆవేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ పవిత్ర బంధాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తాజాగా.. ఓ భార్య తన భర్తని కిరాయి మూకల చేత నరికించి మరీ చంపేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆమెకి భర్త మల్లెపూలు తీసుకురాలేదట. ఈ న్యూస్ మీకే కాదు, పోలీసులకి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి.., అసలు ఈ కేసు విషయంలో ఏమి జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాకి చెందిన దేవీసింగ్ పశువుల దాణా వ్యాపారి. అతని భార్య పింకీ. దేవీసింగ్ కష్టపడి వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో వారికి ఎలాంటి ఆర్ధిక సమస్యలు కూడా లేకుండా పోయాయి. ఇంత వరకు అంతా బాగానే సాగింది. కానీ.., ఆగస్ట్ 22న ముగ్గురు వ్యక్తులు దేవీసింగ్ ఇంట్లోకి వచ్చి.., అతని దారుణంగా నరికి చంపేశారు. తన కళ్ళ ముందే భర్త చనిపోవడంతో పింకీ గుండెలు బాదుకుంటూ రోదించింది.
దేవీసింగ్ మరణాన్ని దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులకి ఎలాంటి క్లూస్ దొరకలేదు. అతనికి ఎవరూ శత్రువులే లేరు. తన సైడ్ నుండి అంతా క్లియర్ గా ఉంది. దీంతో.., నిందితులు ఎవరో తెలియక ఒక వారం రోజుల పాటు పోలీసులకి కూడా చుక్కలు కనిపించాయి. కానీ.., ఒక మహిళా కానిస్టేబుల్ ఎందుకో చనిపోయిన దేవీసింగ్ భార్యని అనుమానించింది. ఈ విషయాన్ని తన పై అధికారులకి చెప్పింది. సరే ఒక రాయి వేసి చూద్దాం అనుకుని.., పింకీని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి.., మాటలతో భయపెట్టి తమదైన స్టయిల్ లో విచారించారు. అంతే.. నా భర్తని చంపించింది నేనే అంటూ అసలు నిజాన్ని బయట పెట్టింది పింకీ. దీంతో.. బిత్తరపోవడం పోలీసుల వంతు అయ్యింది. ఎందుకు ఇంత దారుణం చేశావని పొలుసులు ప్రశ్నించగా.. ఆయన నాకు మల్లెపూలు తీసుకుని రావడం లేదు. అందుకే చంపించా అంటూ.. ఆ భార్య దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో నా భర్త బాగా మారిపోయాడు. మొదట్లో.. రోజూ మల్లెపూలు తెచ్చి నన్ను సంతోషంగా చూసుకునే వాడు. కానీ.., ఈ మధ్య అసలు మల్లెపూలు తీసుకుని రావడం లేదు. ఇంటికి కూడా చాలా లేట్ గా వస్తున్నాడు. అడిగితే.., పని ఎక్కువగా ఉంది అంటూ సమాధానం చెప్తూ వచ్చారు. సుఖాన్ని పంచలేని నా భర్త మీద నాకు ప్రేమ పోయింది. పాగా పెరిగింది. అందుకే కిరాయి మూకకి డబ్బు ఇచ్చి నా భర్తని నేనే చంపించా అంటూ ఆ భార్య అసలు నిజాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్లెపూలు తేవడం లేదని, ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భర్తని చంపుకున్న పింకీని నెటిజన్స్ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.