జీవితంలో నిజమైన ఓటమి అంటే ఆగిపోవడమే. కడ వరకు పోరాడుతూ ఓడిపోయినా అది విజయం కిందే లెక్క. నిజానికి పోరాడితే పోయేది ఏముంది? మహా అయితే చరిత్ర చెప్పుకునే విజయం దక్కుతుంది. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా అనే యువతి కూడా జీవితంలో ఇలాంటి పోరాటమే చేసింది. చుట్టూ సమస్యలు ఉన్నా.., జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆమె ఆశయం ముందు అవన్నీ చిన్నవి అయిపోయాయి. ఓ సాధరణ మున్సిపల్ స్వీపర్ నుండి జిల్లా డిప్యూటీ కలెక్టర్ రేంజ్ కి ఎదిగిన ఆశ కందారా సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆశ కందారా ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సాధారణ యువతి. కానీ.., ఆమె చదువులో మాత్రం టాపర్. బాగా చదువుకుని జీవితంలో సెటిల్ కావాలి అనుకుంటున్న సమయంలో.. ఆశ చదువు ఆపేయించి మరీ ఆమెకి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. ఆశకి ఇద్దరు పిల్లలు పుట్టాక.., చెడు అలవాట్లకి బానిసై భర్త ఆమెని వదిలేశాడు. పైగా.., భర్తని అదుపులో పెట్టుకోలేకపోయింది అంటూ అంతా ఆశ కందారాని అంతా తప్పు బట్టారు. పాతికేళ్ల వయసు కూడా లేకుండా.., చేతిలో ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది ఆశ. ఆ సమయంలో ఆమె జీవితం అంతా నిరాశ, నిస్పృహ తప్ప ఇంకేమి లేదు. కానీ.., ఆశ అక్కడే ఆగిపోవాలి అనుకోలేదు.
పేరెంట్స్ సహకారంతో ఆగిపోయిన తన చదువును మళ్ళీ కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకుండా, తన పిల్లలను తానే చూసుకోవాలన్న ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. స్వీపర్ గా ఉద్యోగం వచ్చాక కూడా ఆశ తన ప్రయత్నాలను ఆపలేదు. ఏదో ఒకటి చేసి.. జీవితంలో ఒక మంచి స్థానానికి చేరుకోవాలని కలలు కనింది. ఇందుకు ఆశ అధికారులే ఆమెకి ప్రేరణగా నిలిచారు. వారి హోదా, గౌరవం తనకి ఎందుకు దక్కకూడదు అనుకుంది.
ఒకవైపు పిల్లల పోషణ, మరోవైపు స్వీపర్ గా 10 గంటల డ్యూటీ.. ఇలాంటి స్థితిలోను ఆశ ఆర్ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. ఆశ 2019లో ఈ ఎగ్జామ్ రాసినా.. కరోనా కారణంగా ఫలితాలు ఆలస్యం అయ్యాయి. అయితే.., ఈ లోపు తాను చేస్తున్న స్వీపర్ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారు అధికారులు. ఆశ ఆ ఆనందంలో ఉండగానే ఆర్ఏఎస్ ఫలితాలు కూడా వచ్చాయి. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది ఆశ. దీంతో.. ఇప్పుడు ఆశ కందారా అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో బాధ్యతల్ని చేపట్టబోతోంది. కష్ట కాలంలో తనకి అండగా నిలబడ్డ కుటుంబమే ఈ సక్సెస్ కి కారణం అని గర్వంగా చెప్తోంది ఆశ కందారా. మరి.. జీవితంలో అంతా అయిపోయింది అనుకున్న స్థితి నుండి ఈరోజు ఆశ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
घर चलाने के लिए लगाती थीं झाड़ू, लेकिन मेहनत लाई रंग और बनी SDM! सुनिए Asha Kandara के संघर्ष की ये कहानी#AshaKandara #SDM #Story pic.twitter.com/R2jekPkg0I
— News Tak (@newstakofficial) July 16, 2021