జీవితంలో నిజమైన ఓటమి అంటే ఆగిపోవడమే. కడ వరకు పోరాడుతూ ఓడిపోయినా అది విజయం కిందే లెక్క. నిజానికి పోరాడితే పోయేది ఏముంది? మహా అయితే చరిత్ర చెప్పుకునే విజయం దక్కుతుంది. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా అనే యువతి కూడా జీవితంలో ఇలాంటి పోరాటమే చేసింది. చుట్టూ సమస్యలు ఉన్నా.., జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆమె ఆశయం ముందు అవన్నీ చిన్నవి అయిపోయాయి. ఓ సాధరణ మున్సిపల్ స్వీపర్ నుండి జిల్లా డిప్యూటీ కలెక్టర్ […]