కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం నుండి కన్నడ సమాజం ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ కేవలం రీల్ హీరోగా మాత్రమే కాదు, సమాజంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడంతో పాటు, మొత్తం 1800 పిల్లలకు సొంత ఖర్చుతో చదువు చెప్పిస్తూ వచ్చారు. నిజానికి పునీత్ కన్నుమూసే వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా. పునీత్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టే.. కన్నడ ప్రజలు ఆయనకి తమ గుండెల్లో స్థానం ఇచ్చారు.
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన పురస్కారాన్ని ప్రకటించింది. సమాజంలో తారతమ్యాలు చూడకుండా, బతికున్నంత కాలం అందరికీ తన ప్రేమని పంచిన పునీత్ రాజ్ కుమార్ కి.. కర్ణాటక ప‍్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. మరి.. చనిపోయిన తరువాత పునీత్ కి ఈ అరుదైన గౌరవం లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ಕನ್ನಡನಾಡಿನ ಜನಪ್ರಿಯ ಕಲಾವಿದ ದಿವಂಗತ ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮರಣೋತ್ತರ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಿ ಗೌರವಿಸಲು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನಿಸಿದೆ.
State Government has decided to honour late Sri #PuneethRajukumar with Karnataka Ratna award posthumously.#KarnatakaRatna
— Basavaraj S Bommai (@BSBommai) November 16, 2021