కరీంనగర్- దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితం. తెలుగు సినీ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్ గా సినీరంగంలో కేరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు.. అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. అతి తక్కువ సమయంలో హిట్ సినిమాలు నిర్మించి, టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరయ్యారు దిల్ రాజు.
ఆయన నిర్మించిన తొలి సినిమా దిల్ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు రాజు. అదేనండీ దిల్ రాజు. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఎంపిక, ఇలా అన్నింటిలో దిల్ రాజు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువని ఇండస్ట్రీ టాక్. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు సినీ నిర్మాణంలో చాలా అంశాల్లో ఇన్ వాల్వ్ అవుతూ వస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు మరో రంగంలోకి ఎంటర్ అయ్యారు.
అవును దిల్ రాజు తాజాగా సింగింగ్ రంగంలోకి ప్రవేశించారు. మీరు విన్నది నిజమే.. దిల్ రాజు పాట పాడేశారు. గతంలో ఆయన నిర్మాతగా నాగ చైతన్య హీరోగా రూపొందిన చిత్రం జోష్ లో దిల్ రాజు ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఐతే అది వెండితెరకే పరిమితం అయ్యింది. ఇదిగో ఇప్పుడు తొలిసారి దిల్ రాజు స్టేజ్‌పై పాట పాడారు. అది కూడా ఓ లవ్ సాంగ్.
కరీంనగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి దిల్ రాజు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్బంగా లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. అంతే ఒక్కసారిగా దిల్ రాజులో ఉన్న గాయకుడు బయటకు వచ్చేశాడు. ఇంతకీ దిల్ రాజు పాడిన పాట ఏదో తెలుసా.. అక్కినేని నాగార్జున, తన సతీమణి అమలతో కలిసి నటించిన నిర్ణయం సినిమాలోనిది.
ఆ సినిమాలో.. హలో గురూ ప్రేమ కోసమే.. అనే పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. ఈ లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో ఇదే పాట పాడారు. దిల్ రాజు పాడిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింకేందుకు ఆలస్యం.. దిల్ రాజు గొంతును మీరూ విని ఎంజాయ్ చేయ్యండి.
#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening 😉 pic.twitter.com/pgpTFZpFij
— Milagro Movies (@MilagroMovies) December 12, 2021