ఏపీలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఏపీలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుడడంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అయితే వెంకన్న దర్శనంలో భాగంగా ఉచిత బస్సుల్లో వెళ్తున్న భక్తులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇక విషయం ఏంటంటే..? ద్వారక తిరుమల వెళ్లే దారిలో బస్సు వెళ్తూ ఉంది. అలా వెళ్తున్న క్రమంలో కొందరు ప్రయాణికులు బస్సును ఆపి ఎక్కారు. అయితే కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో సర్దుకోవాల్సింది పోయి ఒకిరిపై ఒకరు దూషించుకున్నారు. ఇక ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో ప్రయాణికులు కొట్టుకోవడం మొదలు పెట్టారు.
ఇలా వీరు కొట్టుకుంటుండంతో బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స మనుషులనే మాటే మరిచి సర్దుకోకుండా కొట్టుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవుని దర్శనానికి వెళ్తూ కొట్టుకుంటున్న ప్రయాణికుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Uppula Naresh (@UppulaNaresh72) December 13, 2021