కాలేజీ రోజుల్లో యువతి, యువకుడు నచ్చకుని ప్రేమించుకున్నారు. దీంతో కొంత కాలం సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. వీరిద్దరూ బయట ప్రపంచాన్ని మరిచి ప్రేమలోకంలో తెలియాడారు. కట్ చేస్తే ప్రియురాలి తల్లిదండ్రులకు తెలియడంతో కూతురికి పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు గతంలో వీరిద్దరు చనువుగా దిగిన ఫోటోలను వాట్సప్ లో ఏకంగా ప్రియురాలి వరుడికి పంపాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఊహించని నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామం. ఇదే ప్రాంతంలో బత్తుల అలేఖ్య (24) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్ చదువుతున్న రోజుల్లో నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ రవితేజతో ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్నారు.
ఇది కూడా చదవండి: Siddipet: ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏళ్లు గడిచినా సంతానం కలగలేదని!పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరి వ్యవహారం అలేఖ్య తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఓ యువకుడితో వివాహం చేయాలని ముహూర్తం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు రవితేజ ఎలాగైన ప్రియురాలి పెళ్లి ఆపాలనే ప్రయత్నం చేశాడు. ఇక రవితేజ ప్రియురాలితో చనువుగా దిగిన ఫోటోలను ఆమె ప్రియుడు వాట్సాప్ లో వరుడికి పంపాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఏం చేయాలో తెలియక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చి తల్లిదండ్రులు చూడగా అలేఖ్య ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అలేఖ్య మరణించిందనే వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.