ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నంగమూరి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్.. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరో అరంగెంట్రం చేసి, ఇఖ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ లోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోను ముందుంటారు. ఇక ఎన్టీఆర్ కు అమ్మ అంటే అమితమైన ప్రేమ.
తను ఈ స్థాయిలో సినీ పరిశ్రమలో, అభిమానుల ముందు నిలబడి ఉన్నానంటే కారణం.. ఆమె చిన్నప్పటి నుంచి తనపై తీసుకున్న శ్రద్ధే కారణమని పలు సందర్భాల్లో చెబుతుంటారు ఎన్టీఆర్. ఆమె ఎన్టీఆర్ను ఓ విషయంలో వారించేదని రీసెంట్గా ముంబైలో జరిగిన RRR ప్రెస్మీట్లో తెలియజేశారు. ఐతే తనను తల్లి ఓ విషయంలో చాలా సార్లు వారించందని చెప్పారు ఎన్టీఆర్. అవును ముంబయిలో జరిగిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ఈ ఆసక్తిరమైన విషయాన్ని చెప్పారు.
ఎన్టీఆర్ ఏమన్నారంటే.. నటుడు అనేవాడు సౌకర్యవంతంగా ఉండే పాత్రలను చేయాలనుకోకూడదు.. విలక్షణమైన పాత్రలు చేయాలని నమ్మే వ్యక్తుల్లో నేనూ ఒకడిని.. అలా నేను సౌకర్యవంతంగా ఉన్నానని అనుకున్నప్పుడల్లా రాజమౌళిగారు నన్ను బయటకు తీసుకొస్తుంటారు.. ఆయన గొప్ప దర్శకుడే కాదు.. నాకెంతో ఆప్తుడు కూడా.. ఇక అజయ్ దేవగణ్గారి గురించి చెప్పాలంటే, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.. ఆయనతో కలిసి పనిచేస్తుంటే ఓ గురువుతో కలిసి పనిచేస్తున్నట్లే ఉండేది.. అన్నారు.
అజయ్ దేవగన్ పూల్ ఔర్ కాంటే సినిమాలో చేసిన యాక్షన్ స్టంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.. రెండు బైక్స్పై ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలతో స్టన్ అయిపోయాను.. నేను అలా చేయడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు అమ్మతో చెబితే.. అవన్నీ సినిమాల్లోనే కుదురుతాయి.. నిజ జీవితంలో కావంటూ ఆమె హెచ్చరిస్తూ వారించేది.. అలాంటి గురువులా భావించే అజయ్ దేవగన్ తో సినిమాలో కలిసి నటించడం గొప్పగా ఉంది.. అని అన్నారు ఎన్టీఆర్.
అన్నట్లు 400 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదలవుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గురువారం విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్ లో వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ కూడా నటించారు.