సాధారణంగా రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి టీసీలు జరిమానా విధిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో టికెట్ లేనివారితో టీసీలకు చిన్నపాటి గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇలా రైల్వే ప్రయాణంలో టీసీలపై కొందరు ప్రయాణికులు దాడి చేసిన ఘటనలు జరిగాయి. అలానే కొందరు టీసీలు కూడా ప్రయాణికులపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఓ ఘటన జరిగింది. తెలిసో.. తెలియకో ఓ వ్యక్తి టిక్కెట్ లేకుండా రైల్లోకి ఎక్కాడు. అదే సమయంలో టీసీలు తనిఖీలు చేసి.. అతడ్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుడి… టీసీల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ప్రయాణికుడిని కిందపడేసి టీసీలు కాలితో తన్నారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని ముజఫర్ పూర్ ప్రాంతంలో మంబై నుంచి జై నగర్ వెళ్తున్న ఓ రైల్లోకి ఓ వ్యక్తి టికెట్ లేకుండా ఎక్కాడు. ఇదే సమయంలో ఇద్దరు టీసీ అందరి వద్ద టికెట్లు తనిఖీ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో టాప్ బెర్త్ లో కూర్చున్న ఆ ప్రయాణికుడి వద్దకు టీసీలు వచ్చారు. అయితే అతడు తన వద్ద టికెట్ లేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు టీసీలకు ప్రయాణికుడితో చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్తా పెద్ద ఘర్షణకు దారితీసింది. ఇదే సమయంలో టీసీల ప్రయాణికుడ్ని కాలు పట్టుకుని టాప్ బెర్త్ నుండి కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆ ప్రయాణికుడు అధికారిని తన్నుతూ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు టీసీలు కలిసి ఆ వ్యక్తిని బలవంతగా కిందకి లాగారు. అంతేకాక తమపై కాలుతో తన్నేందుకు ప్రయత్నించినందుకు తీవ్రంగా కొట్టారు.
ఇద్దరు బూటు కాళ్లతో ఆ ప్రయాణికుడి ముఖంపై తన్నారు. తోటి ప్రయాణికులు ఆ టీసీలను ఆపే ప్రయత్నం చేశారు. అతడిపై దాడి చేయవద్దని, అవసరమైతే కేసు నమోదు చేయండని కోరారు. దీంతో టీసీలు కాస్త శాంతించారు. ఈ ఘటన అంతటిని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్ లోని ధోలీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది. ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించారని.. అందుకే గొడవ జరిగిందని తెలుస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వ్యక్తిన కొట్టిన ఆ ఇద్దరు టీసీలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#NDTVBeeps | Train Ticket Checkers Viciously Assault Passenger, Kick Him In The Face pic.twitter.com/eYnGF1rFiw
— NDTV (@ndtv) January 6, 2023