రానున్న రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో పంజాబ్ ఒకటి. వచ్చే ఏడాది ఈ రాష్ర్టంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటా పోటీ విమర్శలు, ప్రతి విమర్శలు జరగుతున్నాయి. పంజాబ్ లో ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపా మధ్యే అయినా, కేజ్రీవాల్ రాకతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆప్ పార్టీకి పంజాబ్ లోతమకంటూ ఓ ఓటు బ్యాంకు సెట్ చేసుకుంది. రానున్న ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపడాల్సి పనిలేదు. ఈ నేపథ్యంలో ఆప్ పై పంజాబ్ కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిలో భాగంగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ దిలిల్లో అతిథి ఉపాధ్యాయుల ఆందోళలో భాగంగా సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట బైఠాయించాడు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ పలు పర్యాయాలు పంజాబ్ లో పర్యటించి, అనేక హామీల వర్షం గుప్పించి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గత నెలలో మొహాలీలో ఒప్పంద ఉపాధ్యాయులు ఆందోళన చేయగా కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఆప్ ఆధికారంలోకి వస్తే ఒప్పంద ఉపాధ్యాయుల అందరి సర్వీసు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.
సరిగ్గా అదే విధంగా ఇప్పుడు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ దిల్లిలో సీఎం నివాసం ఎదుట అతిథి ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్ని కేజ్రీవాల్ బదులిచ్చారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఉపాధ్యాయుల చేస్తున్న ఆందోళనలో సిద్ధూ పాల్గొన్నారు. దిల్లీ ప్రభుత్వం ఒప్పంద విద్యా విధానాన్ని అమలు చేస్తుందని సిద్దూ మండిపడ్డారు. ఆప్, కాంగ్రెస్ విమర్శలు, ప్రతి విమర్శలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.