నోయిడాలోని అమ్రాపాలీ హౌసింగ్ సొసైటీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరించాడు. అదే క్రమంలో అమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్టుకు కూడా వ్యవహరించి వివాదంలో చిక్కుకున్నాడు. మరోసారి అమ్రపాలి ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి ధోనీ పేరు వార్తల్లోకి వచ్చింది. ప్రాజెక్టులోని ఫ్లాట్లకు బకాయిలు చెల్లించని ఖాతాదారుల పేర్లలో ధోనీ పేరు కూడా ఉంది. ధోనీ పేరు మీద రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో ధోనీ రూ.20 చెల్లించాడు కూడా. మిగిలిన బకాయిలు కూడా చెల్లించాలంటూ నిర్మాణ బాధ్యతను తీసుకున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ(NBCC) అందరికీ నోటీసులు ఇచ్చింది.
రెండు వారాల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి చెల్లింపులు చేయని నేపథ్యంలో ఆ ఫ్లాట్లపై హక్కును తొలగించి.. వాటిని వేలం వేస్తామంటూ హెచ్చరించారు. అమ్రపాలి సంస్థకు సంబంధించి ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యతలు సుప్రీంకోర్టు ఓ కమిటీకి అప్పగించింది. మొత్తం ప్రాజెక్టులో అమ్ముడపోని ఫ్లాట్లను లెక్కకట్టగా దాదాపు 9,538 ఉన్నట్లు తేలింది. వాటి విలువ లెక్కగట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు ధోనీ 2009-16 మధ్య ప్రచారకర్తగా వ్యవహరించి 2016లో తప్పుకున్నాడు. ఆ సమయంలో ధోనీ, ఇతర సెలబ్రిటీలకు దాదాపు రూ.36 కోట్లు చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది. ధోనీ సహా, పలువురు సెలబ్రిటీలకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించినట్లు తెలిపారు.