నేటికాలంలో కొందరు యువత ప్రేమ పేరుతో శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు కాలేజి వెళ్తున్నామంటూ చెప్పి పార్క్ ల్లోకి వెళ్లి అసభ్యకరమైన పనులు చేస్తుంటారు. మరి కొందరు అయితే జనాలు ఉన్నారు అనే సంగతి మరిచి ఏకంగా రోడ్లపైన, పబ్లిక్ ప్రాంతాల్లో శృతి మించి ప్రవర్తిస్తారు. తాజాగా ఓ ప్రేమ జంట అలానే అతిగా ప్రవర్తించింది. హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించారు. అటుగా వెళ్తున్నారు వారు ఆ దృశ్యాన్ని వీడియోలో చిత్రికరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అది కాస్తా చాజరాజనగర పోలీసుల వద్దకు చేరింది. దీంతో బైక్ నెంబర్ సహయంతో హద్దులు మీరి ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన వారిలో ప్రియుడి సమాచారం సేకరించారు. అనంతరం ఆ వీర ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం తెలిసిందే. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ వీర ప్రేమికుుడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.