అతి కోపం మనిషిని రాక్షసుడిని చేస్తుంది. ఆ కోపానికి ఇగో తోడైతే అతనింక మానవ బాంబ్ కిందే లెక్క. అచ్చం ఇలాంటి మానసిక స్థితిలో ఓ వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. తన మాజీ భార్య వేరే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడిందన్న కోపంతో ఆమెని ఏకంగా 27సార్లు పొడిచి చంపేశాడు ఆ భర్త. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అహ్మదాబాద్ జిల్లాలోని థారా గ్రామానికి చెందిన అజయ్ ఠాకూర్ కి హేమ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అలా కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి దాంపత్య బంధంలో తరువాత గొడవలు మొదలయ్యాయి. ఒకరితో మరొకరు కలసి ఉండటం అసాధ్యమని నిర్ణయించుకుని లీగల్ గా విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ సమయంలో పిల్లలు తండ్రి దగ్గరే ఉంటామని చెప్పడంతో.., కోర్టు పిల్లల బాధ్యత తండ్రికే అప్ప చెప్పింది.
విడాకుల అనంతరం హేమ మహేష్ ఠాకూర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తాజాగా అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే.., ఈ విషయం తెలిశాక అజయ్ ఠాకూర్ కోపంతో రగిలిపోయాడు. నా జీవితాన్ని ఇలా నాశనం చేసి.., ఆమె హాయిగా ఎలా బతుకుతుందంటూ తనలో తాను రగిలిపోయి తన మాజీ భార్యని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
ప్లాన్ ప్రకారం బుధవారం రాత్రి అజయ్ తన మాజీ భార్య ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా మాజీ భార్యపై దాడికి తెగబడ్డాడు. తనని చంపొద్దని హేమ ఎంత వేడుకున్నా.., అజయ్ ఠాకూర్ కనికరం చూపించలేదు. మాజీ భార్యని విచక్షణారహితంగా 27సార్లు కత్తితో పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. రెండో భర్త మహేష్ ఠాకూర్ పోలీస్ కంప్లైట్ ఇవ్వడంతో పోలీసులు హేమ మొదటి భర్తని అరెస్ట్ చేశారు. తల్లి చనిపోవడం, తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోవడంతో వీరి బిడ్డలు ఇద్దరూ అనాథలయ్యారు. చూశారు కదా..? పగ, కోపం, ఇగో వంటి ఫీలింగ్స్ మనిషిని ఎంత క్రూరంగా మారుస్తాయో. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.