గురువారం నందిని తన భర్తను చాక్లెట్ తీసుకురమ్మని అడిగింది. అయితే, భర్త చాక్లెట్ తెచ్చి ఇవ్వలేకపోయాడు. దీంతో నందిని ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో..
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకోవటం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఉండే వారు ఎదుటి వ్యక్తి చేసే చిన్న చిన్న తప్పుల్ని కూడా భారంగా భావిస్తున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ ఇద్దరు పిల్లల తల్లి తన భర్త చాక్లెట్ తెచ్చి ఇవ్వలేదని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకలోని బెంగళూరు హణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నందిని అనే 30 ఏళ్ల మహిళకు 6 ఏళ్ల క్రితం పెళ్లయింది. నందిని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త సెలూన్ నిర్వహిస్తున్నాడు. భర్త సెలూన్‌లోనే ఆమె పనిచేస్తోంది. గురువారం ఉదయం భర్త సెలూన్‌కు వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో తనకు చాక్లెట్ తెచ్చి ఇవ్వమని ఆమె అడిగింది. మధ్యాహ్నం అయినా అతడు చాక్లెట్ తెచ్చి ఇవ్వలేదు. ఆమె అతడికి ఫోన్ చేసింది.
భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మహిళ మనో వేధనకు గురైంది. ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త విగతజీవిగా ఉరికి వేలాడుతున్న భార్యను చూశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, చాక్లెట్ కోసం ప్రాణాలు తీసుకున్న నందిని ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.