పాకిస్తాన్ లో జరిగిన షాకింగ్ సంఘటన ఇది. దుర్మార్గుల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది .నీతి నియమాలు న్యాయాన్యాయాలు మంట కలసిపోతున్నాయి, అత్యాచారాలకు గురవుతున్న వారే ఆత్మరక్షణ చేసుకోలేని రోజులివి. మరి మూగ జీవాలపై కామాంధులు అత్యాచారాలకు పాల్పడితే వాటి ఆవేదన ఎవరికి చెప్పాలి ..ఎంత దారుణం !
విదేశాంగ శాఖలో అత్యంత కీలక వ్యక్తి, వివిధ దేశాల్లో రాయబారిగానూ పనిచేసిన అధికారి కూతురిపై పాశవిక అత్యాచార ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ ను ఊపేస్తున్నది. మహిళలపై లైంగిక దాడుల విషయంలో ఇప్పటికే అట్టడుగున ఉన్న పాక్ లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది, మాజీ దౌత్యవేత్త షౌకత్ ముకదమ్ కూతురు నూర్ ముకదమ్ పై ఆమె స్నేహితులే సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై మహిళాలోకం ఉద్యమిస్తున్నది.
పాకిస్తాన్ లో దౌత్యవేత్త కూతురిపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే మరో షాకింగ్ సంఘటన జరిగింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ఒకారా జిల్లాలో ఐదుగురు యువకులు అతి జుగుప్సాకరమైన నేరానికి పాల్పడ్డారు. ఓ మేకను దొంగిలించి, దానిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చివరికి దాన్ని దారుణంగా చంపేసిన వైనం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అందరూ విమర్శిస్తున్నారు.
మేకపై గ్యాంగ్ రేప్.. నోరు లేని మూగజీవాలపైనా మానవ మృగాలు విరుచుకుపడిన ఘటన పాకిస్తాన్లోని ఓకారాలో చోటు చేసుకుంది. ఓ కూలి తన ఇంట్లో పెంచుకుంటోన్న మేకను దొంగిలించిన ఐదుగురు యువకులు.. ఆ జీవాన్ని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ హీనమైన చర్య తర్వాత మేకను చంపేసి అక్కణ్నుంచి పారిపోయారు. వాళ్లు పరారవుతుండగా చూసిన స్థానికులు.. ఘటనాస్థలికి వెళ్లగా షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా జంతువులకూ బురఖా వేస్తారా? మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే మగవాళ్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందంటూ కొద్ది రోజుల కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ పాక్ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
‘‘నగ్నంగా ఉండే జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా? అవునుమరి, పాపం వాళ్లు రోబోలు కాదుకదా” అని కొందరు, ‘‘ఏంటి పీఎం గారూ.. ఇకపై మూగ జీవాలు అన్నిటికీ బురఖా వేస్తామని చెబుతారా?” అని ఇంకొందరు మండిపడుతున్నారు.
నూర్ ముకదమ్ ఉదంతం తర్వాత, మాట మార్చిన ప్రధాని ఇమ్రాన్.. తన ఉద్దేశం అది కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలని మనుషులు మానవత్వంతో జీవించాలని ఆశిద్దాం .మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.