స్పెషల్ డెస్క్- ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడమనేది చాలా మంది కల. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఎన్నింటినో త్యాగం చేసి చదవాలి. అప్పుడే భారత అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్ లను సాధించగలరు. అందులోను అమ్మాయిలు క్లిష్టతరమైన ఐపీఎస్ ఉద్యోగం సాధించడమంటే మరీ కష్టం. కానీ ఓ ఐపీఎస్ అధికారి మాత్రం తనకెంతో ఇష్టమైన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఐతే అందుకు ఓ కారణం ఉంది.
భారతి అరోరా సీనియర్ ఐపీఎస్ అధికారిణి. హర్యాణా క్యాడర్ కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ అనూహ్యంగా వాలంటరీ రిడైర్మెంట్ కోసం ధరఖాస్తు చేసుకుంది. ఉద్యోగాన్ని వదులుకోవడానికి భారతీ అరోరా చెప్పిన కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడు. అవును భగవాన్ శ్రీకృష్ణుడి సేవకు అంకితమవ్వాలనుకుంటున్నానని, అందుకే స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకుంటున్నానని రాజీనామా లేఖలో రాశారు భారతి.
ప్రస్తుతం గుర్గావ్ జాయింట్ కమిషనర్ కొనసాగుతున్న భారతీ అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ కోరడం ఆసక్తికరంగా మారింది. 1998 బ్యాచ్‌కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2007 ఫ్రిబవరిలో సంజౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు దాడి ఘటనపై అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఆ బృందానికి భారతి అరోరా నాయకత్వం వహించారు. ఆ తర్వాత 2013లో గుర్గావ్‌లో ఉమ్మడి సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
గుర్గావ్ లో ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్ డ్యూటీలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. నిబంధనలు అతిక్రమించినవారు ఎంతటివారినైనా ఆమె లెక్క చేసేవారు కాదు. నాకు శ్రీకృష్ణుడు అంటే ఎనలేని భక్తి, ఆయనకు సేవ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పారు భారతి. కృష్ణుడికి సేవ చేయటం గర్వంగా భావిస్తున్నానని, నేను జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
గురునానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్‌దాస్, తులసీద్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని చెప్పారు. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను అని వాలంటరీ రిటైర్మెంట్ కోసం రాసిన లేఖలో పేర్కొన్నారు భారతీ అరోరా.