భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడు కిన్నెరమెట్ల మొగిలయ్య అలియాస్ దర్శనం మొగిలయ్య కు పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది. మొగిలయ్య కళ గొప్పతనాన్ని మెచ్చుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలో పాట పాడించిన విషయం అందరికీ తెలిసిందే.. ఆ పాట మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్న మొగిలయ్య జీవితం వడ్డించిన విస్తరి కాదు.. పూట గడవని జీవితం.. ముళ్లదారి.. దుర్భర దారిద్ర్యం. మొగిలయ్య భార్య, 9మంది పిల్లలను పోషించడం కోసం చాలా కష్టాలు పడ్డాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చవిచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి కిన్నెర వాయించి వారు ఇచ్చే దాంతో కాలం వెల్లదీసేవాడినని చెప్పారు. కొంత కాలానికి అక్కడ కూడా ఆదరణ కరువైందని దాంతో ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో కష్టాలు, చేతిలో చిల్లిగవ్వలేక భార్య బస్టాండ్‌లో అడుక్కున్న పరిస్థితిని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బస్టాండ్లల్ల డబ్బులు అడుక్కుంటూ సరిగా తిండి చనిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు.
నా భార్య చనిపోయాక కూడా శవాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గతి లేదు. విషయం తెలుసుకున్న కేవీ రమణాచారి గారు 10వేలు ఇస్తే అవి తీసుకుని ఇంటికి తీసుకువెళ్లాను. మూడేళ్ల కిందట ఆమె చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. ఈ మద్యనే తన కొడుకు గుండెలో నీరొస్తే హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ కళ నాతోనే అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో.. పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్నారు. దీని ద్వారా తన కళకు జీవం పోశారన్నారు.. సీఎం కేసీఆర్ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. కిన్నెర కళను బతికించాలన్నదే తన కోరిక అని మొగులయ్య తెలిపాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.