జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే?
దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకూ జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఈ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అలానే స్కోర్ కార్డులను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ సెషన్ 1 పరీక్షలు జనవరి నెలలో జరగ్గా.. సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ జరిగాయి. అయితే ఈ పరీక్షల్లో రెండు సార్లు రాసిన అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని.. దాని ఆధారంగా ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది.
జేఈఈ మెయిన్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. రెండున్నర లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. జేఈఈ సెషన్ 1 మెయిన్ పరీక్షలను 8.24 లక్షల మంది రాయగా.. సెషన్ 2 పరీక్షలను 9 లక్షల మంది రాసినట్లు అంచనా. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ నెల 30 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మే 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తు ఫీజును మే 8వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల లోపు చెల్లించాలి. మే 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జూన్ 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్
పీడబ్ల్యూడీ అభ్యర్థులు, 40 శాతం కంటే అంగవైకల్యం, రాయడం కష్టంగా ఉన్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీ శనివారం నాడు స్క్రైబ్ లను ఎంచుకోవాలి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 4వ తేదీన శనివారం నాడు నిర్వహించబడుతుంది పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగ్గా.. పేపర్ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక సమాధానాల కీని జూన్ 11న ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మరుసటి రోజు అనగా జూన్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ప్రాథమిక సమాధానాల కీని వెబ్ సైట్ లో ఉంచుతారు.
అలానే ఫలితాలను జూన్ 18న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2023 కోసం జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి జూన్ 19 సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ సీట్ కేటాయింపు ప్రక్రియ జూన్ 19 సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 21 బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) ఫలితాలు జూన్ 24వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతాయి.