వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్‌తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
టెక్ మహీంద్ర కంపెనీ.. వ్యాపార సామ్రాజ్యంలో ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. ఇక మహీంద్రా గ్రూప్ ఎండీ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలుసు. సెలబ్రిటీలను మించిన ఫాలోవర్స్‌ను దక్కించుకున్నారు. వ్యాపారం అంటే తాము మాత్రమే ఎదగడం కాకుండా.. తమ ఎదుగుదలకు కారణమైన సమాజం గురించి కూడా ఆలోచిస్తుంది. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాక నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా టెక్ మహీంద్రా కంపెనీ ఓ ప్రకటన చేసింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశ కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. నగరంలోకి నిరుద్యోగ యువతకు.. టెక్ మహీంద్ర ఫౌండేషన్, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఫ్రీట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4 నెలలపాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మేనేజర్ గౌస్‌పాషా పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన 18 – 27 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు అని పేర్కొన్నారు.
వీరికి కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్- ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు. అలానే బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అక్కౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్- ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. అర్హత, ఆసక్తి గల వారు ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి – 76749 85461, 70935 52020 పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.