బుల్లితెర డెస్క్- జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారం అవుతున్న రియాల్టీ షోలలో జబర్దస్త్ మంచి రేటిింగ్ తో దూసుకుపోతోంది. ఇక జబర్దస్త్ షో ద్వారా చాలా మంది నటీ నటులు పరిచయం అయ్యారు. వాళ్లలో అవినాష్ గురించి ప్రేక్షకులందరికి తెలుసిందే. తనదైన మేనరిజంతో అవినాష్ అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు. అటు బిగ్ బాస్ రియాల్టీ షోలోను అవినాష్ సందడి చేశాడు.
ఇక అసలు విషయానికి వస్తే జబర్దస్త్ స్టార్ కమేడియన్ అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవునండీ బాబు అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా అవినాష్ కు నిశ్చితార్ధం కూడా అయ్యింది. అవినాష్ ఎంగేజ్ మెంట్ కు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనూజ అనే అమ్మాయితో తనకు నిశ్చితార్ధం అయ్యిందని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు అవినాష్ తెలిపాడు.
లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చిన సమయంలో వెయిట్ చేయకూడదని మా ఫ్యామిలీలు కలిశాయి, మేం కూడా కలిశామంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. అభిమానులు పెళ్లి గురించి అడుగుతున్నారని, త్వరలోనే అనూజతో తన పెళ్లి జరగబోతుందని అవినాష్ తెలిపాడు. తనకు కాబోయే శ్రీమతి ఫోటోలను సైతం అవినాష్ షేర్ చేశాడు. ఎంగేజ్ మెంట్ ఫోటోలు చూస్తోంటే అవినాష్ కు అనూజ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనూజ ఫ్యామిలీ, అవినాష్ కుటుంబానికి చాలా కాలం నుంచి పరిచయం ఉందట. బిగ్ బాస్ రియాల్టీ షో తరువాత అవినాష్, అరియానా మధ్య ఏదో ఉందని గతంలో బాగా ప్రచారం అయ్యింది. ఆ ప్రచారంపై అవినాష్ గాని, అరియానా గాని స్పందించకపోవడంతో అందులో నిజం అందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అవినాష్ కు పెళ్లి ఫిక్స్ కావడంతో అందులో వాస్తవం లేదని అర్ధం అవుతోంది.