ఒకప్పుడు మనిషి ఆయుః ప్రమాణం కనీసం వంద సంవత్సరాలు ఉండేది. కానీ.., ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో మనం తీసుకునే ఆహారం, కాలుష్య వాతావరణం మనిషి ఆయుః ప్రమాణాన్ని చాలా వరకు తగ్గించేశాయి. ఇప్పుడు 60, 70 బతికితే ఏళ్లు అబ్బో ఎక్కువ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిల్లో కూడా కొంత మంది వందేళ్లకు పైగా జీవించి రికార్డులు నెలకొల్పుతున్నారు కొందరు వ్యక్తులు.
పూర్వం రుషులు, సాధువులు స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటూ.. యోగా ఇతర వ్యాయామాలు చేస్తూ శాఖాహారం తీసుకుంటూ వందేళ్లకు పైగా జీవించే వారని పెద్దలు చెబుతుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనకు తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు మహా అంటే 120 సంవత్సరాల వయసు ఉన్న కురువృద్దులను చూసి ఉంటాం. కానీ.., 199 సంవత్సరాలు బతికి ఉన్న ఓ బామ్మకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది చదవండి: సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు 50 శాతం పెంపు!
అమ్రిత్ పాల్ సింగ్ బబ్లూ అనే ఓ నెటిజన్ తన ఫేస్ బుక్ లో ఖాతాలో ఓ బామ్మకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు. సాధువు ధరించే వస్త్రధారణంలో ఉన్న ఆమె శరీరం పూర్తిగా చిక్కి శల్యంగా కనిపిస్తుంది. నిజంగానే ఆ బామ్మ వయసు 199 ఏళ్లు అంటే ఈజీగా నమ్మే విధంగా ఉంది. ఈ వీడియోలో ఆ పెద్దావిడ ఓ పాపను దీవిస్తూ కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ.., ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. ఈ బామ్మ ఎవరు? ఎక్కడ ఉంటుంది? ఈమె నేపధ్యం ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియాల్సి ఉంది. కానీ.., బామ్మ సుమారు 199 ఏళ్లు బతికి ఉండటం అంటే నిజంగా మిరాకిల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.