కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషలవుతారు.. అని ఓ కవి అన్నట్లు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. ఏ వియసులో అయినా విజయాన్ని పొందవొచ్చు అని ఎంతో మంది నిరూపించారు. వృద్దాప్యంలో కూడా పలు పరీక్షల్లో పాసై తమ సత్తా చాటిన వారు ఉన్నారు.
ఒకప్పుడు మనిషి ఆయుః ప్రమాణం కనీసం వంద సంవత్సరాలు ఉండేది. కానీ.., ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో మనం తీసుకునే ఆహారం, కాలుష్య వాతావరణం మనిషి ఆయుః ప్రమాణాన్ని చాలా వరకు తగ్గించేశాయి. ఇప్పుడు 60, 70 బతికితే ఏళ్లు అబ్బో ఎక్కువ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిల్లో కూడా కొంత మంది వందేళ్లకు పైగా జీవించి రికార్డులు నెలకొల్పుతున్నారు కొందరు వ్యక్తులు. పూర్వం రుషులు, సాధువులు స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటూ.. యోగా ఇతర వ్యాయామాలు చేస్తూ శాఖాహారం తీసుకుంటూ […]