కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషలవుతారు.. అని ఓ కవి అన్నట్లు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. ఏ వియసులో అయినా విజయాన్ని పొందవొచ్చు అని ఎంతో మంది నిరూపించారు. వృద్దాప్యంలో కూడా పలు పరీక్షల్లో పాసై తమ సత్తా చాటిన వారు ఉన్నారు.
మన నుంచి ఎవరూ దోచుకు పోలేనిది ఒక్కటే విద్య. మంచి విజ్ఞానం సంపాదించి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ మంచి జీవితాన్ని గడడానికి విద్య ఎంతో అవసరం. అందుకే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడైనా తమ పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక చదువుకోవాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని ఎంతో మంది నిరూపించారు. చదువుకు వయసుతో సంబంధం లేదని.. వృద్దాప్యంలో కూడా పలు రకాల పరీక్షలు రాసి పాసైన వారు ఎంతోమంది ఉన్నారు. తమిళనాడుకు చెందిన 108 ఏళ్ల బామ్మ కేరళా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో పాసై అందరినీ ఆశ్చర్యపరిచింది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అని ఓ కవి అన్నట్టు కృషీ, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. 108 ఏళ్ల వయసులో కమలకన్ని కేరళా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 108 ఏళ్ల బామ్మ పాసై అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడుకు చెందిన కమలకన్ని రెండో తరగతి చదివి కొన్ని పరిస్థితుల వల్ల కేరళాలోని ఇడుక్కి ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు చదవడానికి వీలే కాలేదు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి సహాయంగా ఉంటూ వచ్చింది. అయితే పెద్ద వయసులో ఆమెకు చదువుకోవాలనే కోరిక కలిగింది. 108 ఏళ్ల వయసులో కమలకన్నికి చదవాలనే కోరిక ను గమనించిన కుటుంబ సభ్యులు ఆమె కోరిక నెరవేర్చడానికి సిద్దమయ్యారు.
ఇక కేరళా ప్రభుత్వం నిరక్ష రాస్యత నిర్మూలన కింద తమిళ, మళియాల భాషలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న కమలకన్ని అక్కడ ప్రభుత్వ శిక్షణ సంస్థలో చేరింది ఎంతో కష్టపడి తమిళం, మళియాళం నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో చదవి రాయగలదు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు ఏకంగా 100కు 97 మార్కులు సాధించింది. దీంతో ఇడుక్కి జిల్లా వండమేడు పంచాయతీ అధికారులు కమలకన్నిని పిలిచి సత్కరించి మెమెంటో ప్రధానం చేశారు.